గుజరాత్ పరివర్తన్ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుజరాత్ పరివర్తన్ పార్టీ
స్థాపకులుకేశూభాయి పటేల్
స్థాపన తేదీ2012 ఆగస్టు 6
రద్దైన తేదీ2014 ఫిబ్రవరి 24
ప్రధాన కార్యాలయంఅహ్మదాబాద్, గుజరాత్
రంగు(లు)పసుపు
Election symbol

గుజరాత్ పరివర్తన్ పార్టీ అనేది గుజరాత్ లోని రాజకీయ పార్టీ. 2012 ఆగస్టులో కేశుభాయ్ పటేల్ దీనిని స్థాపించాడు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చేసింది. మహాగుజరాత్ జనతా పార్టీ విలీనంతో ఇది విస్తరించబడింది. తరువాత 2014 ఫిబ్రవరిలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో తిరిగి విలీనం చేయబడింది.

ఏర్పాటు[మార్చు]

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ 2012 ఆగస్టు 6న ఈ పార్టీని స్థాపించాడు. గోర్ధన్ జడాఫియా నేతృత్వంలోని మహాగుజరాత్ జనతా పార్టీ గుజరాత్ పరివర్తన్ పార్టీలో చేరి తనను తాను రద్దు చేసుకుంది.[1]

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు[మార్చు]

గుజరాత్ పరివర్తన్ పార్టీ 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో పేలవంగా పనిచేసి రెండు స్థానాలను గెలుచుకుంది.[2]

  1. కేశుభాయ్ పటేల్ - విశావదర్ నియోజకవర్గం
  2. నళిన్ కోటడియా - ధరి నియోజకవర్గం

బీజేపీలో విలీనం[మార్చు]

ఈ పార్టీ ఎమ్మెల్యే కేశుభాయ్ పటేల్ 2014 ఫిబ్రవరి ప్రారంభంలో తన అనారోగ్య కారణాలతో రాజీనామా చేశాడు.[3] పార్టీ అధ్యక్షుడు గోర్ధన్ జడాఫియా 2014 ఫిబ్రవరి 24న భారతీయ జనతా పార్టీలో ఈ పార్టీ విలీనాన్ని ప్రకటించాడు. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సురేష్ మెహతా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. గుజరాత్ శాసనసభకు ధరి ప్రాతినిధ్యం వహించిన నళిన్ కోటడియా పార్టీతోపాటు బిజెపిలో చేరారు.[4][5]

మూలాలు[మార్చు]

  1. "Keshubhai Patel formally launches Gujarat Parivartan Party". NDTV.com. 2012-08-06. Retrieved 2012-10-27.
  2. Samay, Live (December 20, 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  3. "Keshubhai resigns as MLA". The Times of India. 2014-02-14. Retrieved 2014-02-17.
  4. "Gujarat Parivartan Party merges with BJP". Niticentral. Archived from the original on 2014-03-06.
  5. "Keshubhai Patel's Gujarat Parivartan Party merges with BJP". Jagran.

బాహ్య లింకులు[మార్చు]