(Go: >> BACK << -|- >> HOME <<)

వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా

వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం వ్యాసం లక్ష్యం.

ఈ వారపు వ్యాసం

2024 22వ వారం

వినాయక్ దామోదర్ సావర్కర్
 

వినాయక్ దామోదర్ సావర్కర్ (1883 మే 28 - 1966 ఫిబ్రవరి 26) భారత రాజకీయ నాయకుడు, కార్యకర్త, రచయిత. ఈయన 1922 లో రత్నగిరి కారాగారంలో ఉండగా హిందూత్వ అనే రాజకీయ హిందూ జాతీయవాదాన్ని అభివృద్ధి చేశాడు. హిందు మహాసభ ఏర్పాటులో ఈయన కీలక సభ్యుడు. తన ఆత్మకథ రాసినప్పటి నుంచి ఆయన పేరు ముందు వీర్ అనే పదాన్ని వాడటం ప్రారంభించాడు. హిందూ మహాసభలో చేరిన తర్వాత హిందువులనందరినీ భారతీయత పేరు మీదుగా ఏకతాటిపైకి తెచ్చేందుకు హిందూత్వ అనే పదాన్ని వాడాడు. సావర్కర్ నాస్తికుడు.

సావర్కర్ ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు. పుణె లోని ఫెర్గూసన్ కళాశాలలో కూడా వీటిని కొనసాగించాడు. ఇతను తన సోదరుడితో కలిసి రహస్యంగా అభినవ భారత్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. తర్వాత తన న్యాయవిద్య కోసం యుకెకి వెళ్ళినపుడు అక్కడ ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. విప్లవం ద్వారా భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందాలని పుస్తకాలు రాశాడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని గురించి ఈయన రాసిన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని బ్రిటిష్ వారు నిషేధించారు.
(ఇంకా…)




ప్రతిపాదించడం

క్రింద ఇవ్వబడిన సూచనలు గమనించి, మీరు ప్రతిపాదించ దలచుకొన్న వ్యాస చర్చాపేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూసను ఉంచండి. ఏదైనా వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా మొదటిపేజీలో ప్రదర్శించాలంటే, దానికి కింది అర్హతలుండాలి

  • వ్యాసం కనీసం ఐదు కిలోబైట్లకు మించి ఉండాలి. 10 కిలోబైట్లకు మించి ఉంటే ఇంకా మంచిది.
  • వ్యాసం గతంలో ఎపుడైనా విశేష వ్యాసముగాగానీ, ఈ వారం వ్యాసంగా కానీ ప్రదర్శింపబడి ఉండరాదు (ఇదివరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములో వ్యాసపు నాణ్యత గణనీయంగా పెరిగి ఉన్నా, లేదా విశేష వ్యాసం స్థాయికి చేరుకొని ఉన్నా, ఈ నియమానికి వెసులుబాటు ఇవ్వవచ్చు).
  • వ్యాసంలో అనువదించవలసిన భాగాలు ఉండరాదు. ఒకవేళ కొన్ని చిన్న చిన్న అనువాదాలు చేయవలసి ఉండీ పరిగణనలో చేర్చినా, మొత్తం వ్యాసం అనువదించే వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శింపబడదు. సాధారణంగా అనువాదం చేయవలసిన భాగాలున్న వ్యాసాలను జాబితాలో చేర్చకండి.
  • వ్యాసంలో కనీసం ఒక సంబంధిత బొమ్మ అయినా ఉండాలి.

తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.


వ్యాసం వార నిర్ణయం

పండగలు, చారిత్రాత్మక రోజులు, ప్రస్తుత ఘటనలకు సంబంధించిన విషయాలను బట్టి వారం వ్యాసాన్ని నిర్ణయించండి. /2024 ISO కేలండర్ వారం సంఖ్య ను చూడండి. వారం వ్యాసం ప్రపంచ ప్రామాణిక కాలం (UTC/GMT) ప్రకారం మారుతుందని (అంటే భారతదేశంలో సోమవారం ఉదయం 05:30 గంటలకు) గమనించండి. వారం వ్యాసం పేరు, వారంతో ప్రత్యేక సంబంధము వివరాలు వున్నప్పుడు రాయండి. ఎంపికకు వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు వర్గాన్ని చూడండి. యాంత్రిక అనువాద వ్యాసాలుగా గుర్తించినవాటి నాణ్యత పెంపొందించటంలో (ఎరుపు లింకులు తొలగించటం, స్థానికత దగ్గరైన వివరాలు చేర్చటం లాంటివి) ప్రత్యేక శ్రద్ద కావాలని గమనించండి

నిశ్చయమైన వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} ను చెరిపేసి {{ఈ వారం వ్యాసం|సంవత్సరం=????|వారం=??}} అన్న మూసను ఉంచండి.

వ్యాస పరిచయ రూపం సృష్టించడం

"ఈ వారం వ్యాసం" పరిచయ రూపంలో దీనిలో స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మలు మాత్రమే వాడాలి.

2024 జాబితా

2024 సంవత్సరానికి గాను వీలయినంతవరకు ఈ జాబితా ప్రకారం "ఈ వారం వ్యాసం" పరిచయ రూపాన్ని (వ్యాస ప్రవేశికలో మొదటి కొన్ని పేరాలు)(కనీసం వారం రోజుల ముందుగా) తయారు చేయాలి. క్రింద నున్న పట్టికలో సంబంధిత వారం అంకెను నొక్కితే "ఈ వారం వ్యాసం - ఫలాని వారం" అనే ఖాళీ పేజీ {{ఈ వారపు వ్యాసం/preload}} కోడ్ తో తెరుచుకొంటుంది. ఎంపిక చేసిన వ్యాసం పేరు, వ్యాసం బొమ్మ పేరు, వ్యాసం పరిచయంనుండి కొంతభాగం ఆ పేజీలో చేర్చాలి. ఆ వ్యాసపు పేరుని క్రింది పట్టికలో లింకుగా పేర్కొనాలి.

ఈ వ్యాసాలు ప్రదర్శనకు ముందు కొంత మెరుగు పరచవలసిన అవుసరం ఉందని గమనించగలరు. పరిచయం, అక్షర దోషాలు, అంతర్వికీ లింకులు, కాపీ హక్కులు, తటస్థత వంటి విషయాలను తప్పక పరిశీలించండి.

ఇవి కూడా చూడండి

సంవత్సరం వారీగా సాధారణ జాబితా, కంప్యూటర్ ద్వారా విశ్లేషణకు ఉపయోగం

వ్యాసాల చర్చాపేజీల వర్గాలు

ప్రదర్శిత సంవత్సరం వారీగా

ప్రదర్శిత వారం వారీగా

వ్యాస పరిచయపేజీలు

వ్యాస పరిగణనలు

ఇతరాలు