వికీపీడియా:రచ్చబండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..


మెటాలో గ్రాంట్ల కోసం అభ్యర్థించినపుడు

మెటాలో వివిధ గ్రాంట్ల కోసం అభ్యర్థించినవారు ఆ సంగతిని ఇక్కడ రచ్చబండలో తెలియపరచండి. ఇక్కడ చెప్పకపోతే ఆ గ్రాంటు కోరిన సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. అసలు ఎవరికీ తెలియకనే పోయే అవకాశం కూడా ఉంది. మీ అభ్యర్థనను ఎండార్సు చేసే అవకాశం అందరికీ కల్పించవలసినది. __చదువరి (చర్చరచనలు) 12:28, 7 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇదే విషయం గురించి మన సభ్యుల అవగాహన కొరకు అంటే వికీమీడియా ఫౌండేషన్ నుంచి గ్రాంటులు పొందడం, ఇంకా ఫౌండేషన్ వారి సహకార కార్యక్రమాలలో (collaboration programs) పాల్గొనడం ఎలా? అనేది అంశం మీద పవన్ సంతోష్ (CIS/A2K) గారు తెవికీ బడి శిక్షణా కార్యక్రమంలో మొదట కొంతసేపు ప్రసంగిస్తారు.
తేదీ: 12.05.2024 ఆదివారం.సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి గూగుల్ మీట్ లో - లింక్
తరువాత శిక్షణాంశం: "వికీపీడియాలో అనువాద పరికరం ఉపయోగించి నాణ్యమైన వ్యాసాలు రాయడం ఎలా?" ప్రణయరాజ్ వంగరి గారితో కొనసాగుతుంది.
సభ్యులు ఈ లింకులో నమోదు చేయవలసినది. ధన్యవాదాలు వి.జె.సుశీల (చర్చ) 12:25, 8 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari, @Vjsuseela గార్లకు ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:04, 13 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు - స్పందన

సభ్యులకు నమస్కారం
తెవికీ సభ్యుల అభీష్టం మేరకు, తెలుగు వికీమీడియన్ల యూజర్ గ్రూప్ తరపున తెవికీ బడి శిక్షణా కార్యక్రమాలు 6 వారాలుగా 2024 ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రతి ఆదివారం మాధ్యాహ్నం 2.00గం నుండి నిర్వహింపబడుతున్నాయి. ఇక్కడ తెవికీ బడి శిక్షణాంశాలు కూడా వివరంగా ఇవ్వడం జరిగింది.
అయితే ఈ కార్యక్రమం మెరుగుపరిచే లక్ష్యంతో సభ్యుల నుండి వారి స్పందనను - శిక్షణాంశాలు గురించి, శిక్షణా కార్యక్రమం సమయం, ఏ ఇతర సంబంధిత విషయం గురించి కానీ కోరడమైనది. సభ్యులు తమ స్పందనను వికీపీడియా చర్చ:తెవికీ బడి పేజీలో తెలియచేసి సహకరించవలసినది.
ధన్యవాదాలు - తెవికీ బడి ''వి.జె.సుశీల'' (చర్చ) 17:59, 12 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Vjsuseela గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:05, 13 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

దిద్దుబాట్లు చేస్తూండగా కరెంటు పోతే చేసిన మార్పుల గతేంటి?

దిద్దుబాట్లు చేస్తూండగా బ్రౌజరు అకస్మాత్తుగా క్రాషయితే, అప్పటి వరకూ చేసిన మార్పుల సంగతేంటి? ఈ సందర్భంలో వాడుకరులకు సాయపడేందుకు వికీసాఫ్టువేరులో ఒక కొత్త అంశాన్ని తెచ్చారు. దిద్దుబాట్లు చేస్తూండగా బ్రౌజరు క్రాష్ అయితే అనే పేజీలో ఈ వివరాలు చూడవచ్చు.__ చదువరి (చర్చరచనలు) 11:00, 13 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరులకు ఎంతో అవసరమైన అంశాన్ని తెలియజేశారు, ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:15, 13 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు.చాలా ఉపయోగకరమైన అంశం. ధన్యవాదాలు --''వి.జె.సుశీల'' (చర్చ) 12:22, 13 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

A2K Monthly Report for April 2024

Dear Wikimedians,

We are pleased to present our monthly newsletter for April, highlighting the impactful initiatives undertaken by CIS-A2K during the month. This newsletter provides a comprehensive overview of the events and activities conducted, giving you insight into our collaborative efforts and engagements.

  • In the Limelight- Chandan Chiring
Monthly Recap
From the Team- Editorial
Comic

You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.

Regards MediaWiki message delivery (చర్చ) 16:22, 14 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

WMF’s Annual Plan Draft (2024-2025) and Session during the South Asia Open Community Call (SAOCC)

Hi Everyone,

This message is regarding the Wikimedia Foundation’s Draft Annual Plan for 2024-2025, and in continuation of Maryana’s email; inviting inputs from members of the movement. The entire annual plan is available in multiple languages and a shorter summary is available in close to 30 languages including many from South Asia; and open for your feedback.

We invite you all to a session on the Annual Plan during 19th May's [:m:South Asia Open Community Call|South Asia Open Community Call (SAOCC)]], in line with the collaborative approach adopted by the foundation for finalizing Annual Plans. The discussion will be hosted by members of the senior leadership of the Wikimedia Foundation.

Call Details (Please add the details to your respective calendars)

  • Google Meeting
    • Date/Time: 19th May 2024 @ 1230-1400 UTC or 1800-1930 IST

You can add any questions/comments on Etherpad [1]; pre-submissions welcomed.

Ps: To know more about the purpose of an Annual Plan, please read our listed FAQs. Look forward to seeing you on the call.

Best MediaWiki message delivery (చర్చ) 16:35, 14 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Sign up for the language community meeting on May 31st, 16:00 UTC

Hello all,

The next language community meeting is scheduled in a few weeks - May 31st at 16:00 UTC. If you're interested, you can sign up on this wiki page.

This is a participant-driven meeting, where we share language-specific updates related to various projects, collectively discuss technical issues related to language wikis, and work together to find possible solutions. For example, in the last meeting, the topics included the machine translation service (MinT) and the languages and models it currently supports, localization efforts from the Kiwix team, and technical challenges with numerical sorting in files used on Bengali Wikisource.

Do you have any ideas for topics to share technical updates related to your project? Any problems that you would like to bring for discussion during the meeting? Do you need interpretation support from English to another language? Please reach out to me at ssethi(__AT__)wikimedia.org and add agenda items to the document here.

We look forward to your participation!

MediaWiki message delivery 21:22, 14 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Feedback invited on Procedure for Sibling Project Lifecycle

You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language

Dear community members,

The Community Affairs Committee (CAC) of the Wikimedia Foundation Board of Trustees invites you to give feedback on a draft Procedure for Sibling Project Lifecycle. This draft Procedure outlines proposed steps and requirements for opening and closing Wikimedia Sibling Projects, and aims to ensure any newly approved projects are set up for success. This is separate from the procedures for opening or closing language versions of projects, which is handled by the Language Committee or closing projects policy.

You can find the details on this page, as well as the ways to give your feedback from today until the end of the day on June 23, 2024, anywhere on Earth.

You can also share information about this with the interested project communities you work with or support, and you can also help us translate the procedure into more languages, so people can join the discussions in their own language.

On behalf of the CAC,

RamzyM (WMF) 02:26, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఏ వ్యాసాలు రాయాలి?

మూడేళ్ళ కిందటి వరకు కూడా తెవికీలో సగటున రోజుకు ఆరేడు కొత్త వ్యాసాలకు మించి వచ్చేవి కావు. ఇప్పుడు రోజుకు 30 కి పైగా వస్తున్నాయి. కొత్త వాడుకరులు ఉత్సాహంగా రాస్తూ ఉండడం, పాతవారు కూడా స్పీడు పెంచడం, వివిధ వికీప్రాజెక్టుల ద్వారా ఏకోన్ముఖమైన కృషి జరగడం వీటికి కారణాలు. లక్ష వ్యాసాల మైలురాయి చేరుకోడానికి 4,500 వ్యాసాల దూరం లోనే ఉన్నాం. ఇంకో నాలుగైదు నెలల్లో ఆ అంకె చూస్తాం కూడా. ఈ క్రమంలో, వ్యాసాల సంఖ్యలో మలయాళాన్ని వెనక్కి నెట్టాం. ఇంకో రెణ్ణెల్లలో మరాఠీని కూడా దాటతాం.

రోజుకో వ్యాసం, రోజుకు రెండు, 5, 10 వ్యాసాలు - రాస్తున్న వాడుకరులున్నారు మనకు. ఇంగ్లీషులో 68 లక్షల పైచిలుకు వ్యాసాలున్నాయి కాబట్టి, ఏ విషయమ్మీద వ్యాసం రాయాలి అనేది పెద్దగా ఆలోచించనక్కరలేదు. ఏదో ఒక ఇంగ్లీషు వ్యాసం తీసుకుని అనువదించవచ్చు. అయితే తెవికీకి దగ్గరగా ఉండేవి, భారతదేశానికి సంబంధించినవి, విషయ పరంగా ప్రాముఖ్యత కలిగినవీ అయిన వివిధ ఆవశ్యక వ్యాసాల జాబితాలు మనకు ఈసరికే ఉన్నాయి. వీటన్నిటినీ ఒకచోట చేర్చిన ఏ వ్యాసాలను సృష్టించాలి అనే ఒక వ్యాసం ఇదివరకే ఉంది. అందులో ఉన్న లింకుల ద్వారా, ఆవశ్యక పేజీల జాబితాలను చూడవచ్చు. పరిశీలించండి. అలాగే వికీపీడియా జాబితాలు అనే వర్గం కూడా చూడవచ్చు.

అలాగే, పై పేజీల్లో ఉన్న సమాచారంతో పాటు ఇప్పుడు మరొక జాబితా కూడా తయారుచేసాను. ఇదొక జాబితాల జాబితా. భారతదేశానికి సంబంధించిన వివిధ విషయాలపై ఎన్వికీలో ఉండి, తెవికీలో లేని వ్యాసాల జాబితాలు ఇవి. మొత్తం వ్యాసాలు 40 - 50 వేలు ఉండొచ్చు బహుశా. కింద చూపిన లింకులకు వెళ్ళి నచ్చిన పేజీని ఎంచుకుని వ్యాసం రాయవచ్చు. ఆ జాబితాల జాబితా ఇది:

  1. వివిధ వృత్తులకు చెందిన భారతీయులు మహిళలు, శాస్త్రవేత్తలు, పురస్కార గ్రహీతలు, మాస్ మీడియా వ్యక్తులు కాకుండా
  2. భారతీయ పురస్కార గ్రహీతలు -ఇందులో మహిళలు, శాస్త్రవేత్తలు, మాస్ మీడియా వ్యక్తులు ఉండరు
  3. భారత మాస్ మీడియా వ్యక్తులు - ఇందులో మహిళలు ఉండరు
  4. భారత మహిళలు
  5. భారతీయ శాస్త్రవేత్తలు ఇందులో మహిళలు ఉండరు
  6. భారత చరిత్ర వ్యాసాలు
  7. భారతదేశంలో విద్య
  8. భారత ఆర్థిక వ్యవస్థ
  9. భారత పర్యావరణం
  10. భారతదేశంలో వివిధ ప్రభుత్వాలు, వ్యవస్థలు

__ చదువరి (చర్చరచనలు) 10:28, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదయంత్రం మానవీయ అనువాదపరిమితి తగ్గించుటకు ప్రవేశపెట్టిన చర్చలో మీ స్పందనలు తెలుపగలరు

తెవికీ అనువాదయంత్రాన్ని ఎక్కువ మంది ఉపయోగించటాన దాని నాణ్యత చాలావరకు పెరిగింది. అనువాదంలో వాక్యనిర్మాణం గాని, ఆంగ్ల పదాలకు సరియైన తెలుగు అర్థాలను సూచించటంలో గాని గణనీయంగా అభివృద్ది చెందింది. గత రెండు సంవత్సరాల క్రిందట అనువాదయంత్రం ద్వారా అనువదించటానికి, ఈరోజున అనువదించటానికి చాలా తారతమ్యం ఉంది. ఇప్పటి పరిస్థితులలో గతంలో కష్టపడవలసినంత అవసరం లేదు. అలా అని పూర్తిగా అనువాదయంత్రమే అనువదిస్తుందని కాదు, చాలా మెరుగుపండిందని దాని అర్థం. కావున ఈ పరిస్థితులలో ప్రస్తుతం మానవీయ అనువాద పరిమితిఆంక్ష 30% నుండి 25% తగ్గించటానికి ప్రతిపాదనలు ఈ లింకులో ప్రవేశపెట్టబడినవి. . అనువాదయంత్రం ద్వారా వ్యాసాలు సృష్టించే వాడుకరులు ఆ చర్చలో రెండు, మూడు రోజులలోపు పై లింకులోకి వెళ్లి స్పందించగలరు.దానిమీద తరువాత తదుపరి చర్యలు గైకొనవలసిఉంది.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 14:29, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

చేశానండీ @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:15, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]