సంధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

వర్ణములను, శబ్దములను కలిపి పలికినప్పుడు ఆ కలయికను సంధి అంటారు. పూర్వపరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధి యని సూత్రము. రాజు + అతడు = రాజతడు అన్నపుడు రాజులోని ఉకారము పూర్వస్వరము. అతడులోని అకారము పరస్వరము. కాన ఆ రెంటికి (ఉ+అ) మారుగ పరస్వరమైన, అకారము నిలిచినది. ఇచ్చట అవ్యహితమై, సంధి యేర్పడినది. [1]

వర్ణాల మార్పు

వర్ణ లోపము

ఆంధ్ర భాష అజంతము కాన అచ్ సంధియే జరుగును సంధి జరిగినపుడు ఒక వర్ణలోపము కల్గినచో వర్ణ లోపమంటారు.

రాజు + అతడు = రాజతడు (జులో ఉకారం లోపించినది.)

వర్ణాగమము

ఒక వర్ణానికి బదులు ఇంకొక వర్ణం కల్గడాన్ని వర్ణాగమము అంటారు.

ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు (ఇందు 'త' లోపించి య వచ్చినది. దీనిని యడాగమము అంటారు.)

వర్ణాదేశము

ఒక వర్ణమునకు బదులు ఇంకొక వర్ణము వచ్చిచేరుట.

కృష్ణుడు + పోయెను = కృష్ణుడు వోయెను. (పకార స్థానమున వకారము వచ్చినది)

భాష ప్రకారం సంధులు

  • తెలుగు సంధులు

మూలాలు

  1. షేక్ అలీ (1998). లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము. నవరత్న బుక్ సెంటర్.
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
"https://te.wikipedia.org/w/index.php?title=సంధి&oldid=3995897" నుండి వెలికితీశారు